Breaking News

భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మంత్రి జిల్లా కలెక్టర్తో కలసి శనివారం స్థానిక లేడీ యామ్థిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు ఈ పథకాన్ని పెట్టారని వారికి ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ తొలుత రాష్ట్రంలో 2 రూ. కిలో బియ్యం మొదటిసారి రాష్ట్రంలో ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. గురుకులాల విధానాన్ని, అలాగే పేదరికం, డ్రాపవుట్స్ కారణాలతో మొదటిసారిగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

రాష్ట్రంలో 44,119 పాఠశాలల్లో 33.81 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఇప్పటికే అమలు చేస్తుండగా, నేటి నుండి 475 జూనియర్ కళాశాలలో 1.48 లక్షల మంది విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కళాశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. వీరికి యూనిఫామ్ కూడా ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది, రాష్ట్ర ర్యాంకుల సాధనకు కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యం నిర్ణయించుకుని, లక్ష్యసాధనకు పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని కష్టపడితే సాధించలేనిది ఏమి ఉండదని అన్నారు. ప్రపంచవ్యాప్తం అయిన “హ్యారీ పోట్టర్” నవల రచయిత్రి జెకె రోలింగ్ నా జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి రాసిన నవల ఏ విధంగా ప్రపంచవ్యాప్తం అయ్యిందో కలెక్టర్ సోదాహరణంగా విద్యార్థులకు వివరిస్తూ, ఈమె జీవితాన్ని స్ఫూర్తిగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి సుందరలక్ష్మి తొలుత కళాశాల ప్రగతి నివేదిక వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అంటూ విద్యార్థులచే మత్తు పానీయాలు, మాదకద్రవ్యాల వలన కలిగే దుష్ఫలితాలు వివరిస్తూ, వాటి జోలికి వెళ్ళ వద్దని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు బండి రామకృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, డీఈవో పి వి జె రామారావు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పి.బి సాల్మన్ రాజు, ఎంఈఓ దుర్గాప్రసాద్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మెటిల్డారాణి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *