రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా లో జరిగిన సౌత్ ఇండియా సైన్సు ఫెస్ట్- తూర్పు గోదావరి జిల్లా సైన్సు ఫేర్ 2024-25 లో గెలుపొందిన ప్రదర్శనకి. లు జనవరి 8,9,తేదీలలో విజయవాడ లో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శన లో పాల్గొన నున్నట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.
ఎంపికైన ప్రదర్శనలు …
బ్రాహ్మణగూడెం జెడ్పీహెచ్ఎస్ లో 9 వ తరగతి చదువుతున్న కె రోహిత్ హైడ్రాలిక్ జేసిబి, దుళ్ల జెడ్పీహెచ్ఎస్ లో 9 వ తరగతి చదువుతున్న ఏ . కృష్ణ చైతన్య రూపొందించిన కార్బన్ శోషణ , గోపాలపురం జెడ్పీహెచ్ఎస్ లో 10 వ తరగతి చదువుతున్న జి గీతా సౌమ్య, ఎస్ జ్యోత్స్న లు రూపొందించిన రైతుల స్నేహ పూర్వక షూస్, పాతతుంగపాడు జెడ్పీహెచ్ఎస్ కి చెందిన 10 వ తరగతి విద్యార్థులు ఎం సిద్దూ , జి చరణ్ తేజ లు రూపొందించిన లైట్ సేవింగ్ యాక్సిడెంట్ అలర్ట్ సిస్టమ్ (GPS), రాఘవాపురం జెడ్పీ హై స్కూల్ స్కూలు అసిస్టెంట్ జి. శేఖర్ రూపొందించిన కలుపు తీయు యంత్రం, పోతవరం జెడ్పీ హై స్కూల్ స్కూలు అసిస్టెంట్ కె. బాల సుబ్రహ్మణ్యం రూపొందించిన మల్టీపర్పస్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రదర్శనలు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News