Breaking News

మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలిసి మొవ్వ మండలంలోని మొవ్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం సిద్ధం చేస్తున్నదీ లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారు విద్యార్థులతో కలిసి భుజించారు. తొలుత వారు పాఠశాలలో కలియతిరిగి విద్యార్థులకు వంట చేసే ప్రదేశాన్ని, తాగునీటి వసతి, అదేవిధంగా గణితం, కంప్యూటర్ ల్యాబ్ లను పరిశీలించారు. వంట గది ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి ట్యాంకులను తరచుగా శుభ్రపరచాలని సూచించారు. పాఠశాలలో ఉత్తీర్ణత నూరు శాతం సాధించాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *