-లోకేష్ జన్మదిన వేడుకల్లో ఎన్డీయే కూటమి నేతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ జాతీయ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గురువారం భవానిపురంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో శివాలయం సెంటర్లో నిర్వహించిన లోకేష్ జన్మదిన వేడుకల్లో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (అన్నా) ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కూటమినేతల సమక్షంలో కేక్ కట్ చేశారు. కార్యకర్తలు స్వీట్లు పంచుకొని తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్బంగా గన్నె వెంకట నారాయణ ప్రసాద్ మాట్లాడుతూ అభిమన్యుడిలా కాకుండా అర్జునుడిలా ముందుకు సాగి యుద్ధం గెలిచిన ఆయన నాయకత్వం పై అభిమానులు కృతజ్ఞతతో ఉన్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి విజయాన్ని అందించేందుకు లోకేష్ తీసుకున్న వ్యూహాలు, అయన నాయకత్వ నైపుణ్యం తో పూర్తిస్థాయి నాయకుడిగా నిరూపించుకున్నాడు అన్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడుతూ పార్టీలోనూ ప్రజల్లోనూ నమ్మకాన్ని కల్పించిన వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు స్ఫూర్తితో నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు .
అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ యువగళం పాదయాత్ర లో తన పదునైన వాగ్ధాటి తో వైసిపి అరాచకాలను ఎండగట్టి కార్యకర్తలకు వెన్ను దన్నుగా నిలిచిన వ్యక్తి లోకేష్ అన్నారు. కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికీ ఆరోగ్య భీమా సౌకర్యాలను కల్పించిన లోకేష్ యువతరానికి సూర్తిగా నిలిచారన్నారు .
కార్యక్రమంలో కూటమి నేతలు యెదుపాటి రామయ్య, పచ్చవ మల్లిఖార్జున, భాను, మహేశ్, గాండ్లపర్తి బ్రహ్మరెడ్డి, మైలవరపు దుర్గరావు, సుబ్బారెడ్డి, పెద్ది సతీష్, వెంకట్రావ్, సుకాసి సరిత, దొడ్ల రాజా, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, రౌతు రమ్య ప్రియ , బబ్బూరి వెంగళ రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News