విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్‌లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు గారి పాత్ర గురించి ఇవాళ దావోస్ పర్యటనే పెద్ద నిదర్శనం. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పారిపోయిన పారిశ్రామికవేత్తలందర్ని నేడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దావోస్‌లో జరిగే పెట్టుబడిదారుల సదస్సే ఆర్థిక పెట్టుబడులకు మూలం, దానికి చంద్రబాబు గతంలో 4 సార్లు, లోకేశ్ బాబు 2 సార్లు హాజరయ్యారు, నేడు చంద్రబాబు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులతో కలిసి పారిశ్రామికవేత్తలతో కలిసి గతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని బిల్‌గేట్స్ ని కోరారు. ఆంధ్రాలో పెట్టుబడులు పెడితే వారికి కావాల్సిన స్థలాలు, అనుమతులు, రాయితీలు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం దావోస్‌లో విజయవంతంగా జరుగుతావుంది. చాలామంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఉద్యమం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు నష్టాల్లోకి వెళ్తే కేంద్రంతో అనేక సార్లు సంప్రదింపులు జరిపితే, విశాఖ ఉక్కుకు 11,400 కోట్లను కేంద్రం ప్యాకేజీ ప్రకటించటం చంద్రబాబు కృషి, పోయిందనుకున్న స్టీల్ ప్లాంట్ మళ్లీ నిలబె ట్టిన ఘనత చంద్రబాబు ది, దానికి ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా చంద్రబాబు కి ధన్యవాదాలు, జైజేలు పలుకుతున్నారు,
పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలొస్తాయి, ఆ ఉద్యోగాలొస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుంది, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా నష్టపోయింది, పారిశ్రామికవేత్తలంతా వీళ్ల బెదిరింపులకు భయపడి మన రాష్ట్రానికి రాకుండా పెట్టుబడులు వేరే రాష్ట్రాల్లో పెట్టారు. అటువంటిది నేడు మళ్లీ చంద్రబాబు, లోకేష్ లు దావోస్‌లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారు, దాంతో నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.
టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి గడచిన 7 నెలల కాలంలో గత 5 సంవత్సరాల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి, ఆనాటి విధ్వంసాన్ని మరిచిపోయి ఆ విధ్వంస శిథిలాల మీదనే నేడు ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనం ప్రారంభమైంది, మళ్లీ ఈ భారత దేశంలో మొత్తం అంతర్జాతీయంగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావటానికి ఆకర్షింపబడుతున్నాయి, దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ చేస్తున్న విశేషమైన కృషి మన కళ్లకు కనపడుతుంది, గతంలో 2014 నుంచి 2019 వరకు విశాఖపట్నంలో జరిపిన మూడు ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లలో 16లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు, 2019లో ప్రభుత్వ టర్మ్ అయిపోయేనాటికి 5లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం జరిగింది, దాదాపు 5లక్షల పైగా ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగింది. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కాలంలో పూర్తిగా సహకారమైతే నేడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి క్రమంలో ముందుండేది, అలా కాకుండా జగన్‌మోహన్‌రెడ్డి పరిశ్రమల్ని భయపెట్టి, పారిశ్రామికవేత్తల్ని ఉన్నవాటిని కూడా ఇక్కడ నుంచి పారద్రోలిన పరిస్థితుల్లో ఈ రోజున పెట్టుబడిదారులు భయపడుతూ భయపడుతూనే ఈ రోజున ఏంపర్వాలేదు చంద్రబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చనే దృష్టితో ముందుకొస్తున్నారు, ఈ 7 నెలల పాలనలోనే 5లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించటం జరిగింది, విశాఖ మొన్న ప్రధాన మంత్రి గారిచేత 2లక్షల కోట్ల ప్రాజెక్టుల శంకస్థాపనలు చేయటం మనం చూశాం, ఆర్సీలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ పెట్టడానికి ముందుకొచ్చారు, లోకేష్ ప్రయత్నంతో అనేక ఐటీ కంపెనీలు మళ్లీ రాబోతున్న వాస్తవాన్ని మనం చూస్తున్నాం.
దావోస్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో చంద్రబాబు, లోకేష్ పర్యటించి గత 3 రోజులుగా విశేషమైనటువంటి కృషి మనందరం వార్తలు చూస్తున్నాం అవన్నీ సత్ఫలితావ్వబోతున్నాయన్నది వాస్తవం, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు 5 ఏళ్ల కాలంలో 20లక్షల ఉద్యోగాలను రాష్ట్ర యువతకు కల్పిస్తామని వాగ్దానం చేయటం జరిగింది, ఇప్పటికే వచ్చినటువంటి పెట్టుబడుల కారణంగా ఇప్పటికే 5లక్షల ఉద్యోగాలొస్తాయి, ఈ రాష్ట్రం పురోగామి దశలో ఉంది, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చేతిలో చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ముందుకు పోవటమనేది ఖాయం, 2014 నుంచి 2019లో ఏ రకంగా అయితే ప్రతిరోజూ కూడా ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక పెట్టుబడి రాష్ట్రానికి రావటం జరిగింది, అలాగే నేడు కూడా రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు చంద్రబాబునాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకుపోవడం ఖాయమన్నారు.
సాక్షి పత్రికలో నేటికీ అబద్ధాలు వండివారుస్తున్నారు, ఎవరికుంది కసి, జగన్‌మోహన్‌రెడ్డి నీకుంది కసి, గత 5 ఏళ్ల నీ పరిపాలనలో కసి, కార్పణ్యం, అనేకరకాలుగా లక్షణాలను ఈ రాష్ట్ర ప్రజల మీద చూపించావు, దుర్మార్గం చేశావు, ఇవన్నీ ఈరోజున ఎక్కడా కనపడని పరిస్థితుల్లో నువ్వు ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి కసి, కార్పణ్యంతో ముందుకుపోతుందని అబద్ధాలను ప్రచారం చేస్తున్నావు, రాష్ట్ర ప్రజల నిన్ను గమనిస్తున్నారు, ఇప్పటికే నిన్ను 11 సీట్లకు తరిమారు, రేపు ఈ రాష్ట్రంలో నీ పార్టీ, నువ్వు కనపడకుండా అదృశ్యమైపోవడం ఖాయమని హెచ్చిరిస్తూ ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.
ఈ విలేకరుల సమావేశంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గన్నే ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసం మునియ్య, నాయకులు సోలంకి రాజేంద్రకుమార్, మాచవరపు ఆదినారాయణ, తిరుమలేష్, పరిశపోగు రాజేష్, విశ్వరూప్ పాల్గొన్నారు
Prajavartha Online Telugu News