Breaking News

మైనారిటీల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది

-ముస్లిం మైనారిటీ అసోసియేష‌న్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో మంత్రి గొట్టిపాటి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూట‌మి ప్ర‌భుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ఎల‌క్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేష‌న్ డైరీ, క్యాలెండ‌ర్ ను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫ‌రూక్ తో క‌లిసి మంత్రి గొట్టిపాటి గురువారం స‌చివాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ముస్లిం, మైనారిటీ ఉద్యోగుల‌కు కూట‌మి ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వ ద్వంద విధానాల‌తో మైనారిటీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని తెలిపారు. విద్యుత్ శాఖ‌కు సంబంధించి ఎటువంటి స‌మ‌స్య‌ను అయినా ప‌రిష్క‌రించ‌డానికి ఎల్ల వేళ‌లా తాను సిద్ధంగా ఉంటాన‌ని అసోసియేష‌న్ ఉద్యోగుల‌కు మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కారుణ్య నియామ‌కాల‌తో పాటు వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌ను కొంద‌రు అసోసియేష‌న్ నాయ‌కులు ఈ సంద‌ర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి… వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. కార్య‌క్రమం అనంత‌రం మంత్రి గొట్టిపాటితో పాటు మ‌రో మంత్రి ఫ‌రూక్ ను ఎల‌క్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు శాలువాతో స‌త్క‌రించారు. కార్య‌క్ర‌మంలో ఉమ్మ‌డి 13 జిల్లాల‌కు చెందిన అసోసియేష‌న్ నాయ‌కులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *