-ముస్లిం మైనారిటీ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సభలో మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ను మైనారిటీ శాఖ మంత్రి ఎన్ ఎం డీ ఫరూక్ తో కలిసి మంత్రి గొట్టిపాటి గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముస్లిం, మైనారిటీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వ ద్వంద విధానాలతో మైనారిటీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. విద్యుత్ శాఖకు సంబంధించి ఎటువంటి సమస్యను అయినా పరిష్కరించడానికి ఎల్ల వేళలా తాను సిద్ధంగా ఉంటానని అసోసియేషన్ ఉద్యోగులకు మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలతో పాటు వివిధ రకాల సమస్యలను కొందరు అసోసియేషన్ నాయకులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి గొట్టిపాటి… వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం అనంతరం మంత్రి గొట్టిపాటితో పాటు మరో మంత్రి ఫరూక్ ను ఎలక్ట్రిసిటీ ముస్లిం అండ్ మైనారిటీస్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి 13 జిల్లాలకు చెందిన అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News