Breaking News

ఎస్సీ యువతకు పెద్ద ఎత్తున శిక్షణ, ఉపాధి

-సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పిఎం అజయ్ (ప్రధాన మంత్రి అనుచిత జాతి అభ్యున్నతి యోజన) స్కీం పై సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి ని ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ గురువారం ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల సీడాప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంచేందుకు సీడాప్ నుంచి అందిస్తామని సీడాప్ చైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించడం జరిగిందని ఇరువురు చైర్మన్లు తెలిపారు. దీనిపై మరింతగా కలిసి పని చేయాలని కోరుకున్నారు.. రాష్ట్రంలో విస్తృతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా యువతకు ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున కల్పించేందుకు కృషి చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ డాక్టర్ గౌతమ్, డాక్టర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *