-కాలువ ఒడ్డున ప్రజలకు ఆహ్లాదకరమైన పార్క్ ఏరియా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
కాలువగట్ల సుందరీకరణతో ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించటమే కాకుండా కాలువ ఒడ్డున ప్రజలకు ఆహ్లాదకరమైన పార్క్ ఏరియా కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా బందర్ కెనాల్ బండ్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరాన్ని అత్యంత సుందరంగా మార్చేందుకు, కాలుష్య నియంత్రణకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు బందర్ కాలువ, ఏలూరు కాలువ గట్ల సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకురమ్మని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న స్థలాలలో , ఎంతో అందంగా మొక్కలతో నింపటమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు వాకింగ్ ట్రాక్, సిట్టింగ్ ఏరియా, ప్లే ఐటమ్స్, తో 3.3 కోట్ల రూపాయలతో మూడు కిలోమీటర్ల బందర్ కాలువ గట్లను, 2 కోట్ల రూపాయలతో రెండు కిలోమీటర్ల ఏలూరు కలవగట్లను, 15 వ ఆర్థిక సంఘం నిధులతో సుందరీకరణ పనులు చేపట్టారని తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానెర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇంచార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) లతా, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News