Breaking News

వివిధ చట్టాల పై అవగాహన కల్పించేందుకు క్యాండిల్ ర్యాలీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో చైతన్యం తీసుకువచ్చి మహిళ కోసం అమలు అమలు చేస్తున్న వివిధ చట్టాల పై అవగాహన కల్పించేందుకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక సరస్వతి ఘాట్ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు నిర్వహించిన క్యాండిల్ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి ఎస్. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వాటిని ఆకలింపు చేసుకుని రక్షణ పొందాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో చైతన్యం తీసుకు వచ్చినప్పుడే మహిళలపై హింసలను అరికట్టగలుగుతామని తెలిపారు. మన తల్లి సోదరి బిడ్డ కూడా ఆడపిల్ల అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కే విజయ కుమారి , డిఎస్పీ లు భవ్య కిశోర్, బి విద్య , మహిళా పోలీసు సి ఐ మంగదేవి , ఎస్ ఐ అమీనా బేగం, సిడిపివో బెబీ రాణి,  పెద్ద ఎత్తున మహిళలు క్యాండిల్ ర్యాలీ లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *