Breaking News

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సుజనా చౌదరి హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ది ఫలాలు అందరికీ అందేలా సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్యే సుజనా మంగళవారం శాసనసభలో మాట్లాడారు.
ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి, అత్యధిక మెజారిటీ ఇచ్చిన పశ్చిమ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో బీసీల సంక్షేమం కోసం రూ 38,605 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం రూ 47,456 కోట్లను అలాగే ఎస్సీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ 8,159 కోట్ల ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం రూ 20,281 కోట్ల రూపాయలను ఎస్సీల సంక్షేమం కోసం అందించడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి జవసత్వాలను అందించవచ్చన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని పోలవరం పూర్తయితే వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగాల మీద ఆధారపడ్డ ఇతర వృత్తులు అభివృద్ధి చెంది రాష్ట్రం ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందన్నారు. విద్యా, వైద్యం , వ్యవసాయ రంగాలను ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ను గత పాలకులు ఓటు బ్యాంకు గా మాత్రమే చూసి అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. ప్రధాని మోడీ 10 ఏళ్ల పాలనలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని ఐదు నుంచి నాలుగో స్థానంలోకి రావడానికి ఎంతో సమయం లేదన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయని సుజనా చౌదరి స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో సాంకేతికతను వినియోగించి మెరుగైన ఫలితాలు పొందాలని సూచించారు.. వ్యవసాయ రంగంలో విదేశీ డ్రోన్ టెక్నాలజీ నీ అన్వయించి ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.. అమరావతి నీ గ్రోత్ ఇంజన్ గా పెట్టడంతో పాటు అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ కు చర్యలు చేపట్టాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *