Breaking News

విజయవాడ 11 అన్న క్యాంటీన్లో త్రాగునీటికి ఏర్పాటుచేసిన ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అయోధ్య నగర్ బుడమేరు కాలువ వద్దకు లో ఉన్న అన్న క్యాంటీన్లో ప్రజలకు సిద్ధమైన త్రాగునీరిన అందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ ను పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారము ఉదయం అధికారులతో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లో కు ఆహారం కోసం వచ్చే ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 11 అన్నా క్యాంటీన్లో ఉన్న ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్ లోనూ అమర్చారని తెలిపారు. మరుగుదొడ్లు, వాడుక నీరు పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అని ఎండాకాలంలో ఆహారం కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడను ఇచ్చే విధంగా, అధికారులు చర్యలు తీసుకుని ఏర్పాటు చేయాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 11 అన్న క్యాంటీన్లో ఉన్న నోడల్ ఆఫీసర్లను షఫుల్ చేయాలని, తద్వారా ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ ఎప్పటికప్పుడు నిత్య నూతన ఆలోచనలతో అభివృద్ధి చెందుతుందని అధికారుల పర్యవేక్షణ ఎప్పుడూ ఉంటుందని అన్నారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పీ వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, బయాలజీ సూర్యకుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *