-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా జోనల్ కార్యాలయాలతో పాటు 286 సచివాలయాతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను శాఖధిపతులు, జోనల్ అధికారులు, సచివాలయం సిబ్బందితో సమస్యలను చర్చించి సమస్యలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి విషయాలపై సూచించారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సచివాలయం పరిధిలో సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి అంశాలపై చర్చించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 21 ఫిర్యాదులు అందగా అందులో ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగం లో 5 అందుకున్నారు, vas 2, ఇంజనీరింగ్ 11, హెల్త్ 2, ఎస్టేట్ 1 , ఫిర్యాదులను అధికారులు అందుకున్నారు.
ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యకుమారి, పి.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ఆర్ ఎఫ్ ఓ వెంకటేశ్వరరావు, జెడి (అమృత్) మరియు ఎస్టేట్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ లత, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజీ సూర్యకుమార్,, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News