-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఉన్న అన్ని బరియల్ గ్రౌండ్సలో మరుగుదొడ్లు, నీటి సరఫరా వసతులు ఉండాలి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. సోమవారం ఉదయం ముత్యాలంపాడు వద్దగల స్వర్గపురి, అంబేద్కర్ పార్క్ పరిశీలించారు. కావాల్సిన అన్ని వసతులను కల్పించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఉన్న బరియల్ గ్రౌండ్స్ అన్నిటిలోనూ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అందుకు అధికారులు పర్యవేక్షించి నివేదికనందించాలని అధికారులను ఆదేశించారు. ముత్యాలంపాడు లోని అంబేద్కర్ పార్క్ ను పరిశీలించి, పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంజనీరింగ్, ఉద్యానవన శాఖలు సమన్వయంతో పని చేయాలని నగరంలో ఉన్న అన్ని పార్కులను పర్యవేక్షించి, కావాల్సిన వసతులన్నీ అమర్చి, ప్రజలకు పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణవరణానికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పీ వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, బయాలజీ సూర్యకుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News