Breaking News

జంక్షన్ లను అభివృద్ధి చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర అందాలను పెంచే విధంగా జంక్షన్ లను అభివృద్ధి చేయాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. సోమవారం ఉదయం తన పర్యటన లో భాగంగా పుష్ప హోటల్ సెంటర్ వద్ద గల రెడ్ సర్కిల్, గిరిపురం, ముత్యాలంపాడు, పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ జంక్షన్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది కి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ అయినప్పటికీ రాజకీయ నాయకుల విగ్రహాలు పునర్ స్థితికి తీసుకురానందుకు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సిటీ ప్లానర్ ని ఆదేశించారు.

పర్యటనలో సైడ్ కాలువలను పరిశీలించి, డిసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలని, మాపుల ఆధారంగా డీసిల్టింగ్ చేసిన కాలువను, కలర్ చేసుకుని డీజిల్టింగ్ చేయని కాలువను కవర్ చేస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. గిరిపురం, సత్యనారాయణపురం వద్దగల డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్లను పరిశీలించారు, ప్రాంతాలాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, మొక్కలతో అందంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజ్ నీరును ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో తక్షణమే తీసుకుని పనులు మొదలు పెట్టే దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్లు పి.సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పీ వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, బయాలజీ సూర్యకుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *