-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
RELIANCE JIO Info.Comm Ltd, Optical Fiber Cable కంపెనీ వారికి ఫార్మాట్ -1 సర్టిఫికెట్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుదవారం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి కమిటీ పై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వెంకటగిరి మండలం బుస్సపాలెం గ్రామం, వల్లెవేడు గ్రామ పంచాయతీ పరిధిలోగల అటవీభూమి కంపార్టుమెంటు నెం.197 (0.05 Ha) మరియు యతలూరు గ్రామం మరియు పంచాయతీ పరిధిలోగల అటవీ భూమి కంపార్టుమెంటు నెం. 193 (0.11Ha) మరియు చిట్టమూరు మండలం, యల్లసిరి గ్రామం మరియు పంచాయతీ పరిధిలో గల అటవీభూమి కంపార్టుమెంటు నెం.173 (0.04la) మరియు మొలకల పూడి గ్రామం మరియు పంచాయతీ పరిధిలో గల అటవీ భూమి కంపార్టుమెంటు నెం.171 (0, 24Ha) నందు గల మొత్తము 0.44 హెక్టర్ల అటవీ భూమిని RELIANCE JIO Info.Comm Ltd, Optical Fiber Cable (OFC) , 2006 క్రింద Annexure-I (Form-I) సర్టిఫికేట్ జారీచేయడానికి తీర్మానం చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్య నారాయణ, సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారి వెంకటగిరి నాగభూషణం, వరదయ్యపాలెం జడ్పీటీసీ వెంకటేశ్వర్లు, తిరుపతి జడ్పీటీసీ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News