-నేడు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫిజిక్స్ పేపర్ -II, ఎకనామిక్స్ పేపర్ -II మరియు ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు 29,041 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29,041 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 86 జనరల్, 14 ఒకేషనల్ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిజిక్స్ పేపర్ -II, ఎకనామిక్స్ పేపర్ -II మరియు ఒకేషనల్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 28,599 మంది, ఒకేషనల్‌లో 1,040 మంది మొత్తం 29,639 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా జనరల్‌లో 566 , ఒకేషనల్‌లో 32 మంది, మొత్తం 598 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News