Breaking News

జర్మనీలో ఉద్యోగావకాశాలు – మెకాట్రోనిక్స్ నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో జర్మన్ భాషా శిక్షణతో పాటు మెకాట్రోనిక్స్ ఉద్యోగావకాశాలు కల్పించే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 మార్చి 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన అర్హతలు:

✔ జాబ్ రోల్: స్కిల్డ్ మెకాట్రోనిక్స్
✔ అర్హత: మెకాట్రోనిక్స్ / ఎలక్ట్రికల్ / ఎనర్జీ సిస్టమ్స్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా
✔ వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల మధ్య (పురుషులు, మహిళలు అందరూ అర్హులు)
✔ అనుభవం: కనీసం 3 సంవత్సరాల అనుభవం
✔ శిక్షణ వ్యవధి: 6 నెలలు (A1, A2, B1 స్థాయిలో జర్మన్ భాష శిక్షణ & వీసా ప్రాసెసింగ్)
✔ ఉద్యోగ వ్యవధి: 2 సంవత్సరాలు
✔ జీతం: 2800 యూరోలు – 3600 యూరోలు (సుమారు ₹2,52,658 – ₹3,24,846)
✔ వీసా & ఫ్లైట్ ఖర్చులు: కంపెనీ భరిస్తుంది
✔ ఇన్సూరెన్స్: కంపెనీ అందిస్తుంది
✔ ఫుడ్ & అకామొడేషన్: అభ్యర్థి స్వయంగా భరించాలి

జర్మన్ భాషా శిక్షణ:

☑ A2 స్థాయి వరకు ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ/విశాఖపట్నం) ఆఫ్లైన్ క్లాసులు
☑ B1 స్థాయి శిక్షణ ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ ద్వారా
☑ వీసా ప్రాసెసింగ్ A2 స్థాయి తర్వాత ప్రారంభం

ఎంపిక విధానం:

1. ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్

2. టెక్నికల్ స్కిల్స్ అసెస్మెంట్ (వర్చువల్ మోడ్)

కావలసిన పత్రాలు:
పాస్‌పోర్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్, డిప్లమా లేదా డిగ్రీ సర్టిఫికెట్స్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇప్పటివరకు అనుభవం ఉన్న కంపెనీల వి, లైట్ ఆర్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు
బయోడేటా.

దరఖాస్తు ప్రక్రియ:

➡ దరఖాస్తు చివరి తేదీ: 25-03-2025

➡ దరఖాస్తు లింక్: https://naipunyam.ap.gov.in/program-registration

➡ CV’s పంపండి: skillinternational@apssdc.in

➡ మరిన్ని వివరాలకు కాల్ చేయండి: 9988853335, 8712655686, 8790118349, 8790117279.

రీఫాండబుల్ సెక్యూరిటీ డిపాజిట్

ఆసక్తి కలిగిన అభ్యర్థులు వారి రీఫాండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ను 40000/- ను రెండు విడతలు గా 2COMS వారికి చెల్లించవలెను
ఈ డిపాజిట్ లు సబ్మిట్ చేయడం వలన అభ్యర్థులు తమ శిక్షణ లో గైర్హాజరు నివారించడానికి మరియు కోర్స్ నుండి డ్రాప్‌ఔట్ నివారించడానికి నిర్దేశించబడినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *