Breaking News

మెష్ ఏర్పాటు చేసుకోవాలి, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో హోటల్స్ తప్పనిసరిగా వ్యర్ధాలను డ్రైన్ లోకి నేరుగా పంపకుండా మెష్ లు ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్  రైల్ పేట ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ఎదుట రోడ్, డ్రైన్ల ఆక్రమణలు, హోటల్స్ వ్యర్ధాలు డ్రైన్లలోకి నేరుగా రావడం గమనించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్ పేట వైపు నిత్యం రైల్వే స్టేషన్, ప్రభుత్వ వైద్యశాలకు అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకల వలన తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందన్నారు. అలాగే హోటల్స్ లోని వ్యర్ధాలను నేరుగా డ్రైన్లలోకి వదలడం వలన డ్రైన్లు బ్లాక్ అయి మురుగు నిలిచి తీవ్ర దుర్గంధం వస్తుందన్నారు. కనుక హోటల్స్ నిర్వహకులు తప్పనిసరిగా వ్యర్ధాలను డ్రైన్లోకి పంపే మార్గంలో మెష్ ఏర్పాటు చేసుకోవాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఆయా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు ఆక్రమణలు చేసి ట్రాఫిక్ సమస్య సృష్టిస్తున్నారని, అటువంటి ఆక్రమణలను ఎప్పటికప్పుడు తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. రైల్ పేట మెయిన్ రోడ్ కి ఇరువైపులా డ్రైన్లలో పూడిక తీత చేపట్టాలన్నారు. రైల్వే స్టేషన్ వైపు జిఎంసి స్థలాన్ని సర్వే చేసి, ఆక్రమణలు ఉంటే తొలగించడం, సదరు స్థలంలో పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డిఈఈని ఆదేశించారు. రైల్వే స్టేషన్ ఎదురు నూతన డ్రైన్ల నిర్మాణంకు అనుమతులు మంజూరు చేశామని, పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తొలుత నాజ్ సెంటర్ మస్టర్ పాయింట్ ని తనిఖీ చేసి, శానిటేషన్ కార్యదర్శులు సకాలంలో హాజరు కాకపోవడం గమనించి, పారిశుధ్య కార్మికుల విధులను పర్యవేక్షణ చేసే కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు పిన్ పాయింట్ గా ఉదయం ప్రధాన వీధుల శుభ్రం, ఇంటింటి చెత్త సేకరణ, మధ్యాహ్నం డ్రైన్ల శుభ్రం చేయాలన్నారు.
పర్యటనలో డిఈఈలు నాగభూషణం, మధుసూదన్, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, కార్పొరేటర్ పి.సమత, ఏఈలు, టిపిఎస్ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *