Breaking News

జిల్లాలో గృహ నిర్మాణాలకు ఊతం

-ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు… ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారికి అదనపు ఆర్థిక లబ్ధి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా, జిల్లాలో 2029 నాటికి “అందరికీ గృహనిర్మాణం” అనే లక్ష్యాన్ని సాధించేందుకు, అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తోందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు.

ప్రభుత్వం జీఓఆర్టీ నెంబర్ 9 ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-1 (పీఎంఏవై-1) పథకం క్రింద ఇప్పటికే మంజూరు చేయబడిన ఇళ్లకు 1.80 లక్షల రూపాయలకు అదనంగా పెండింగ్ నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ. 50,000, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 75,000 లబ్ధిదారులకు అదనంగా ఇంటి నిర్మాణం కోసం అందించనున్నదని తెలిపారు. ఈ ఆర్థిక సహాయం 10.12.2024 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే వర్తిస్తుంది.

లబ్ధిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత బిల్లులను వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసి విస్తృత ప్రచారం చేయాలని మే నెలాఖరు నాటికి 17,455 గృహాలు పూర్తి చేయాలని, ఎంపీడీఓలు, హౌసింగ్ ఏఈలు ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికే ఈ అదనపు ఆర్థిక లబ్ధి వర్తిస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమెనిటీస్ సెక్రటరీలు అర్హత కలిగిన ప్రతి ఇంటిని తనిఖీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇంటి యొక్క ఫోటోను క్యాప్చర్ చేస్తారు. “లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ, వార్డు ఎమెనిటీస్ సహాయకులు, ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకునేలా సమన్వయం చేసుకోవాలి” అని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *