-రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్
-పదవతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 17వ తేదీ నుండి మార్చి 31 తేదీ వరకు జరుగనున్న పదవ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లా కల్లెక్టర్లను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం రాష్ట్ర్త సచివాలయం నుండి పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, కలెక్టర్ కాన్ఫెరెన్స్, స్వర్ణాంధ్ర స్వచ్చాంద్ర, పి – 4 సర్వే తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ విజయానంద్ జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించగా జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ సంబందిత అధికారులతో హాజరయ్యారు.
చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ… రాష్ట్రంలో మార్చి 17 నుండి మార్చి 31 వరకు నిర్వహించే పదవతరగతి పరీక్షలను అత్యంత పటిష్టంగా నిర్వహించాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పదవ పరీక్షలకు సంబంధించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు. మొత్తం 3450 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే పరీక్షా ప్రశ్నా పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లకు తీసుకెళ్లేటప్పుడు పటిష్టమైన బందోబస్తు ఉండాలని తెలిపారు. పరీక్షా పేపర్ల తరలింపుపై జిల్లా స్థాయిలో సంబంధిత పోలీస్ సూపరింటెండెంట్ లు, పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కార్యకలాపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షా కేంద్రాలలోనికి విద్యార్థులు సెల్ ఫోన్ లను తీసుకెళ్లడం అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులు తగు విధంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.పదవ పరీక్షల కోసం రాష్ట్ర స్థాయిలో 0866297454 నెం తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. మార్చి 24,25 తేదీలలో నిర్వహించే కలెక్టర్ల కాన్ఫెరెన్స్ కు సంసిద్ధం కావాలని తెలిపారు. జిల్లాలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని తప్పనిసరిగా ప్రతి మూడవ శనివారం ప్రతి ఒక్కరిని భాగ స్వామ్యం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ పరిశుబ్రత దిశగా ప్రతిఒక్కరు కృషి చేయలాని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిధిలో ఇంటర్‌నెట్, జిరాక్స్ సెంటర్‌లను మూసి వేయించాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో సహా ఏ ఇతర సిబ్బంది ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్ లేకుండా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరాలన్నారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్‌లు, విద్యుత్ సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, వైద్యాధికారులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యాలా సంబందిత అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబందిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News