Breaking News

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యులైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహనీయులన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలుగు భాషకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చర్చకు వచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. భాషలకు ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే ఆలోచన అందరికీ వచ్చిందన్నారు. అయితే మహనీయులు పొట్టి శ్రీరాములు దాన్ని ఆచరణలో పెట్టారన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం తుది శ్వాస విడిచారన్నారు. ఆయన చనిపోయాక చాలా భాషా రాష్ట్రాలకు డిమాండ్ వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలోనే మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిందన్నారు. ఆ విధంగా దేశంలోని వివిధ భాషలకు ప్రత్యేక రాష్ట్రాలు రావడానికి శ్రీరాములు కారకులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఆంజనేయ ప్రసాద్ కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *