-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పిడి లు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఆర్డీఓ లు రామ్మోహన్, కిరణ్మయి, భాను ప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తాసిల్దార్లు తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులు నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల సేకరణకు సంబంధించి పనులను ప్రాధాన్యత తీసుకొని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారులు, తాసిల్దారులు, జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు. జాతీయ రహదారి భూసేకరణ పనులు త్వరిత గతిన పూర్తికావడానికి ప్రణాళికను రూపొందించుకొని పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతి ఉన్న రహదారి విస్తరణ పనులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని భూ సేకరణకు సంబంధించిన పెండింగ్ పనులలో సంబంధిత ఆర్టీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. భూసేకరణ పెండింగ్ అవార్డు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన ఎటువంటి అలసత్యం లేకుండా వెంటనే పనులు పూర్తయ్యేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్ హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైల్వే ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ కు సంబంధించిన భూ సేకరణ పనులు పూర్తయ్యేలా ఆర్డీఓ లు, తాశిల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.తిరుపతి రేణిగుంట బైపాస్ సంబంధించిన పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ లను ఆదేశించారు.
ఈ సమావేశంలో తిరుపతి, నెల్లూరు, చెన్నై నేషనల్ హైవే పి డీలు తిరుపతి వెంకటేష్, ఎం కె చౌదరి, రవీంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News