Breaking News

శాసనసభ సభ్యుల క్రీడా, సాంస్కృతిక పోటీలు దిగ్విజయంగా ముగిసాయి… : శాప్ చైర్మన్ రవి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 18, 19,20 తేదీలలో నిర్వహించిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని గతంలో ఎన్నడు లేని విధంగా ఈ కార్యక్రమాలు జరిగాయని స్పీకర్ అయ్యన్న ఆదేశాల మేరకు ఈ పోటీలను ఏర్పాటు చేయడం జరిగిందని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి, కల్చరల్ మినిస్టర్ దుర్గేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు సహకారంతోనే ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించగలిగామని దాదాపు 70 శాతం శాసనసభ్యులు శాసన మండల సభ్యులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యారని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. అదేవిధంగా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ, కల్చరల్ డిపార్ట్మెంట్, సమన్వయంతో ఎవరు ఊహించిన రీతిలో ఈ కార్యక్రమాలు నిర్వహించగలిగామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ శాఖకు సంబంధించి విజయవంతంలో కష్టపడిన గ్రౌండ్ మెన్ నుండి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వరకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన శాప్ చైర్మన్ రవి నాయుడు… ఈ ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర ఎనలేదని రవి నాయుడు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *