Breaking News

జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చు దిద్ధుదాం ..

-నవోదయ స్ఫూర్తి తో ప్రతిజ్ఞ చేసిన అధికారులు
-నాటుసారా నిర్మూలనకు సారా ముద్దాయిలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి
-నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాను సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రయత్నం లో భాగంగా నాటు సారా నిర్మూలన లక్ష్యంగా, సారా తయారీ, రవాణా చేస్తూ పట్టుబడిన ముద్దలను సక్రమమైన మార్గంలో తీసుకుని రావడం ద్వారా సత్ఫలితాలు సాధించడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో సమావేశ మందిరంలో “నవోదయం 2.0” కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేసిన అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ప్రచార వాహనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, నాటు సారా తయారీ, రవాణా, విక్రయాలు చేసే సుమారు 400 మంది వ్యక్తుల పై బైండోవర్ కేసులు నమోదయ్యాయి అని పేర్కొన్నారు. అటువంటి వ్యక్తులను జనజీవన స్రవంతిలో భాగస్వామ్యం చేసి, గౌరవప్రదమైన జీవన భృతి కల్పించడం లో భాగంగా వారికీ ఆసక్తీ ఉన్న రంగంలో శిక్షణ ఇవ్వడం, వారి వారి కులవృత్తులు తెలుసుకుని ప్రోత్సహించడం చేయాలన్నారు. వారిలోని సృజనాత్మకతను గుర్తించి శిక్షణా తరగతులు నిర్వహించడం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం వివిధ కులాల వారికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా యూనిట్స్ మంజూరు చేయడం పై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు కల్పన దిశగా అడుగులు వేయాలని , రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు పథకాలు సద్వినియోగ పరచుకోమని సూచనలు జారి చెయడం , చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ పథకాల ప్రయోజనం కల్పించడం ద్వారా ముద్దాయిలందరూ సద్వినియోగ పరచుకోవాల్సిందిగా కోరుతూ , ముమ్మర ప్రచారం కల్పించడం ముఖ్యం అన్నారు.
అదేవిధంగా ఇప్పుడిప్పుడే మన వ్యవస్థలో చాప కింద నీరులా ప్రజల మరియు విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న “గంజాయి” మరియు “డ్రగ్స్ “ను పూర్తిగా నిర్మూలించమని అన్నీ జిల్లా అధికారులుకి సూచనలు జారి చేశారు మరియు ప్రచార రథం ప్రారంభించారు. నవోదయం స్పూర్తిగా తీసుకొని ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను జోడించి సరికొత్త ప్రణాళికతో నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని నాటుసారా, గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దే ప్రక్రియ శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో సారా రహిత, డ్రగ్స్, గంజాయి రహిత మన రాష్ట్రాన్ని నిలపడంలో అందరం సమిష్టిగా కృషి చెయ్యాలని విజ్ఞప్తి చేశారు .

నవోదయం 2.0 కార్యక్రమం స్ఫూర్తితో నాటు సారా మహమ్మారి తరిమికొట్టడం క్షేత్ర స్థాయిలో పలు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ జిల్లా ఎక్సైజ్ & ప్రోహిబిషన్ అధికారి సీహెచ్ లావణ్య తెలియ చేశారు. నవోదయం 2.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రం, మన జిల్లా నుండి నాటు సారా మహమ్మారి తరిమికొట్టడం అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవి.సుబ్బరాజు, జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారిణి. కె .విజయ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి , కే ఎన్. జ్యోతి , డీఈవో కే వాసుదేవరావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతా మణి, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బి. సుబ్బారావు, డిఆర్డిఏ , సేర్ప్ ,ఎక్సైజ్, పోలీసు , మునిసిపల్ , తదితరులు శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *