Breaking News

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , ఎస్పీ సతీష్ కుమార్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ అభివృద్ది పధకాలు , స్వర్ణాంధ్ర 2047 , వాట్సప్ గవర్నెస్ , గ్రీవియెన్స్ రిడ్రసల్ విధానం , భూ సంబంధిత అంశాలు , సమ్మర్ కార్యాచరణ , పీ4 , లా అండ్ ఆర్డర్ అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సదస్సును ప్రారంభిచారు. మార్చి 25 మరియు 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు గుంటూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది మూడవ సారి. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయా నంద్, డిజిపి హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు , జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *