Breaking News

జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం కలక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ లో సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ అధ్యక్షతన జిల్లా కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం(IYC) గా సంవత్సరంగా ప్రకటించిందని , దానికి అనుగుణంగా జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని , IYC సంవత్సర వేడుకల కోసం లక్ష్యాలు , సమయపాలనతో కూడిన జిల్లా స్థాయి ప్రణాళికలు , వార్షిక కార్యాచరణతో కూడిన నెల వారి క్యాలెండర్ ను కమిటీ ఆమోదించడం జరిగింది. జిల్లాలోని ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీల వివరాలతో పాటు క్రొత్తగా కొమ్మిటీ సభ్యుల వివరాల కంప్యూటరైజేషన్ ప్రక్రియను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వెంటనే పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ మాసంలో IYC యాక్షన్ ప్లాన్ లో చేయవలసిన యాక్టివిటీస్ కు సంబంధించి ఏప్రిల్ 7 వ తేదిన వరల్డ్ హెల్త్ డే సందర్బంగా మహిళలకు హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి డియం అండ్ హెచ్ఓ తో , అలాగే జిల్లా స్థాయి సెమినార్ ను జిల్లా సమైక్యల ద్వారా నిర్వహించడానికి పీడీ డిఆర్డీఏ తో కో ఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ (MPFC) గోడౌన్లకు ప్రపంచంలోనే అతి పెద్ద ధాన్యం నిల్వ ప్రణాళికా ( World Largest Grain Storage Plan ) ప్రాజెక్టు క్రింద ఏమైనా కవర్ చేయడానికి అవకాశం వున్నదో లేదో చూడాలని జిల్లా సహకార సంస్థ అధికారికి సూచించారు. జిల్లాలో పీఏసీలు నాబార్డు రుణం ద్వారా అందించిన ఆర్ధిక సహాయంతో నిర్మించిన మల్టీపర్పస్ గౌడన్లలో స్థానిక రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేలా వ్యవసాయశాఖ, మార్కేటింగ్ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ గుంటూరు జిల్లాకు ఒకటి కేటాయించినట్లుగా నాబార్డ్ డిడియం సంయుక్త కలెక్టర్ కు తెలియజేయగా , ఎక్కువ ఎఫ్ పి ఓ లు మంజూరు అయ్యేలా చూడాలని నాబార్డ్ వారికి సూచించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా అందించిన రుణాలను , ఓవర్ డ్యూస్ కు యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని రికవరీ లు చేయాలని సంయుక్త కలెక్టర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ వివిధ మండలాల్లో మహిళా పాడి సహకార సంఘం ఏర్పాటు కోసం 15 గ్రామాలను గుర్తించిందని , జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో 101 ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు పనిచేస్తున్నాయని సంయుక్త కలెక్టర్ కు పశు సంవర్ధక శాఖ జె.డి నరసింహారావు తెలియజేశారు. జిల్లాలో ఆరు ఎఫ్ ఎఫ్ పి ఓ పొలకంపాడు , చేబ్రోలు , గుంటూరు , దుగ్గిరాల , పొన్నూరు , కటేవరం లకు ఎన్ సిడిసి నుండి నిర్వహణ ఖర్చు ఐదు లక్షల రూపాయలు అందించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా మత్స్య శాఖాధికారి తెలిపారు.
సమావేశంలో జిల్లా సహకార శాఖ అధికారి వీరాచారి, జిల్లా పంచాయితీ అధికారి నాగసాయి కుమార్, వ్యవసాయ శాఖ అధకారి ఎన్. వెంకటేశ్వర్లు , ఏ.డి ఉద్యాన శాఖ రవీంద్ర జీడీసీసీ బ్యాంకు సీఈఓ కృష్ణవేణి, పీడీ డీఆర్డీఏ విజయలక్ష్మీ , నాబార్డు డీడీఎం శరత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *