విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ ప్లేస్‌మెంట్ సన్నాహక వేదిక ప్రెప్‌ఇన్‌స్టా ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) 4.0 నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ కార్యక్రమంలో భాగమైందని సంస్థ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ విద్యార్థులను పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాలు, పోటీతో కూడిన అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేస్తుందన్నారు. దేశంలో సాంకేతిక విద్యను మార్చే ప్రెప్‌ఇన్‌స్టా కోర్సులు ఇప్పుడు నీట్ 4.0 పోర్టల్ ద్వారా పొందవచ్చన్నారు. 2019లో స్థాపించిన ప్రెప్‌ఇన్‌స్టా జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ వంటి అధిక డిమాండ్ ఉన్న రంగాలలో విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించడంపై దృష్టి పెడుతుందన్నారు. బిగ్ 4, ఫాంగ్ సహా అగ్రశ్రేణి ప్రపంచ కంపెనీలలో ప్లేస్‌మెంట్లు పొందడంలో విద్యార్థులకు ఈ కార్యక్రమాలు సాయపడతాయన్నారు. అంతే కాదు ప్రతి విద్యార్థి ప్లేస్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ట్రాక్ చేసేందుకు, వారి పనితీరు పర్యవేక్షించడానికి, అనుకూలమైన అసెస్‌మెంట్స్ నిర్వహించడానికి ఎస్ఎఎఎస్ టూల్‌తో కాలేజీ మేనేజ్‌మెంట్‌కు ప్రెప్‌ఇన్‌స్టా సాయపడుతుందన్నారు. ప్రెప్‌ఇన్‌స్టా సహ-వ్యవస్థాపకుడు మనీష్ అగర్‌వాల్ మాట్లాడుతూ, ఏఐసీటిఈ, నీట్ కార్యక్రమంతో భాగస్వామ్యం భారతదేశంలో సాంకేతిక విద్య భవిష్యత్‌ను మార్చే దిశగా ఒక అడుగు వేసిందిన్నారు. కెరీర్‌కు కావాల్సిన నైపుణ్యాలకు తగ్గట్టుగా విద్యార్థులను సిద్ధం చేసి వేగంగా ఎదుగుతున్న ఉద్యోగ మార్కెట్‌లో వారికి ఉద్యోగాలు వచ్చేలా చూడటం మా వచ్చే ఆర్థిక సంవత్సంరలో తన నెట్‌వర్క్‌ను 250+ కాలేజీలకు విస్తరించాలన్నది ధ్యేయంగా పెట్టుకుందన్నారు. 2019లో విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నీట్ కార్యక్రమం, విద్యార్థులు ముఖ్యంగా ఆర్థికంగా, సామాజికంగా అణిచివేతకు గురయ్యే నేపథ్యం కలిగిన వారికి సాంకేతిక విద్యా పరిష్కారాలు చూపి వారి ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.
Prajavartha Online Telugu News