Breaking News

శ్రీ రామనవమి వేడుకల్లో పాల్గొన్న పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీరామ నవమి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు.

శ్రీ నగరాల సీతారామ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కొత్తపేట కోమల విలాస్ సెంటర్ వద్ద కమిటీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు జరిపే కార్యక్రమం పొట్నూరు వెంకట కనక సింహాచలం ప్రసన్న తేజ దంపతులు నిర్వహించి, ఆహ్వానించిన దంపతులకు ముఖ్యంగా కమిటీ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు తెలిపారు.

శ్రీ విజయ దుర్గ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ రామనవమి వేడుకల్లో పోతిన వెంకట మహేష్ ఈ కార్యక్రమం నిర్వహించిన వారు తమ్మిన అప్పారావు వివర శ్రీను ఇల్లు పిల్ల అప్పారావు గారు ఎస్వీ రమణ పాల్గొన్నారు.

శ్రీరామనవమి సందర్భంగా పి దుర్గారావు ఉండబత్తుల దుర్గారావు ఈది పార్వతి తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాముల వారి పూజ మరియు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో  వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు.

రెడ్డి కాలనీ 43వ డివిజన్ శ్రీ కోదండరామ ఆలయం నందు శ్రీరామనవమి వేడుకల్లో పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గువ్వల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు బట్టిపాటి శివ, మరియు కార్పొరేటర్లు ఆంజనేయ రెడ్డి, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *