Breaking News

తడి పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరుపరిచి ఇవ్వాలి… : జిల్లా కలెక్టర్

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త :
తడి పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరుపరిచి ఇచ్చే విధంగా ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఆయన మొవ్వ మండలంలోని గూడపాడు, పెద్దపూడి గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత ఆయన గూడపాడు గ్రామంలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించడంతోపాటు గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చెత్త నిర్వహణను పరిశీలించి సక్రమంగా నిర్వహిస్తున్న పని పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

గూడపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్తను ఎలా వేరు చేస్తున్నారని కలెక్టర్ పరిశీలించారు. కొంతవరకు చెత్తను బాగానే విభజించి ఇస్తున్నప్పటికీ కొంతమంది రెండూ కలిపే ఇచ్చేస్తున్నారని, తడి పొడి చెత్తను పూర్తిస్థాయిలో వేరుచేసి ఇవ్వాలని ఇంటి యజమానులకు సూచించారు. అనంతరం ఆయన పెద్దపూడి గ్రామంలో ప్రధాన రహదారి వెంబడి ఆర్ సి సి పైపులతో నూతనంగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పని పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, పనిని ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేసి నిర్వహిస్తున్న ఆ గ్రామ సర్పంచ్ పి రజిని, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి శివరామ కృష్ణ ప్రసాద్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి బహుమతి అందించారు.

మొవ్వ మండల అభివృద్ధి అధికారిణి జే విమాదేవి, గూడపాడు గ్రామ సర్పంచ్ టి ఉగాది లక్ష్మి, ఇతర అధికారులు, పారిశుధ్య నిర్వహణ సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *