Breaking News

సంక్షేమ,  అభివృద్ధి కార్యక్రమాలకు  చేయూతను అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ,  అభివృద్ధి కార్యక్రమాలకు  చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను కోరారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ అధికారులతో సామాజిక బాధ్యత నిధులు ( సి ఎస్ ఆర్) నిధుల వినియోగంపై సమావేశం నిర్వహించారు. ఈ విషయమై బెల్ కంపెనీ ప్రతినిధులు, నాబార్డ్,  ఎస్ ల్యాబ్ ప్రతినిధులతో సి ఎస్ ఆర్ నిధుల కేటాయింపు పై జిల్లా కలెక్టర్ చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చాలా అంగన్వాడి కేంద్రాల భవనాల నిర్మాణం నిధుల కొరత వలన సగంలో ఆగిపోయాయన్నారు. మిగిలిన భవనాలను పూర్తి చేయుటకు కార్పొరేట్ సంస్థలు వారి సిఎస్సార్ నిధులు కేటాయించేందుకు ముందుకు రావాలన్నారు. అలాగే జిల్లాలో దివ్యాంగుల జాబితా సిద్ధంగా ఉందని వారికి కావలసిన వివిధ రకాల వినికిడి యంత్రాలు, కాలిపర్స్, ఊత కర్రలు, లాప్టాప్ లు, చేతి కర్రలు తదితర పరికరాలను సమకూర్చేందుకు నిధులు అందజేయాలన్నారు. మొవ్వ డిగ్రీ కళాశాల,  గుడివాడ ఐటిఐలల్లో కంప్యూటర్ ల్యాబ్లూ నెలకొల్పుటకు అవసరమైన నిధులు సమకూర్చాలన్నారు. జిల్లాలోని మార్కెట్ యార్డ్లలో  కోల్డ్ స్టోరేజ్ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చాలని అన్నారు

ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈ ఈ సుధాకర్ గౌడ్, ఇన్చార్జి సీఈఓ పద్మజ, వృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కామరాజు, ఏపీఎంఐపి పిడి విజయ లక్ష్మి, మొవ్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి,  గుడివాడ ఐటిఐ ప్రిన్సిపాల్ గౌరీ మణి, జి జి హెచ్ పర్యవేక్షకులు ఆశాలత,  బెల్  కంపెనీ డీజీఎం ఫణి కుమార్, నాబార్డ్ రాష్ట్ర సమన్వయకర్త మహేష్,  విజయవాడ  ఎస్ ల్యాబ్స్  ప్రతినిధి నరేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *