Breaking News

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి…

-పెంచిన గ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలి
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై విధించిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దుచేసి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని; పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.50/- పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు జయప్రదం చేసిన వారందరికీ అభినందనలు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పదేపదే పెంచుతూ ప్రజలపై పెనుబారాలు మోపుతున్నది. పలు ఎన్నికల సందర్భాల్లో కంటితుడుపు చర్యగా ధరలు తగ్గిస్తూ, ఎన్నికల ప్రక్రియ ముగియగానే ప్రజలపై ధరల గుదిబండ వేస్తున్నది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోపోతున్న కేంద్ర ప్రభుత్వం, ముడిచమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వలన ఆ భారం రవాణారంగంపై పడి నిత్యవసర వస్తువుల ధరలు పదే పదే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ సుంకం పేరుతో రూ.2/- లు చొప్పున పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం. అలాగే వంట గ్యాస్ ధరను రూ.50/- లు పెంచి ప్రజలపై పెనుబారం వేయడాన్ని సిపిఐ తీవ్రంగా నిరసిస్తున్నది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరను ఉపసంహరించుకోవాలని; ఎక్సైజ్ సుంకం పేరుతో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *