-ఎమ్మెల్యే పరామర్శ, భరోసా తో పులకించిన బాలిక కుటుంబ సభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని 34 వ డివిజన్ కుద్దుస్ నగర్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. అదే ప్రాంతంలో నివసించే ఒక మైనార్టీ బాలిక దీర్ఘ కాలికంగా నరాల వ్యాధి తో బాధ పడుతున్న సుజనా మిత్ర ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే వారి ఇంటికి సుజనా చౌదరి వెళ్లి బాలికను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను వ్యాధి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుట్టుకతోనే నరాలకు సంబంధించిన వ్యాధితో తమ కుమార్తె ఎండీ.ముబీన (13) బాధ పడుతోందని, అనారోగ్యం కారణంగా పూర్తిగా మంచానికే పరిమితమైందని తండ్రి షరీఫ్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి కి వివరించారు. ప్రస్తుతం తమ కుమార్తెకు ప్రభుత్వం 6 వేల రూపాయల పింఛను ఇస్తోందని, 15 వేల పింఛన్ అందేలా చేయాలని తండ్రి ఎమ్మెల్యే ను కోరారు. బాలికకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు . అలాగే తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన డివిజన్ సుజనా మిత్ర ను అభినందించారు.
Prajavartha Online Telugu News