Breaking News

అధికారులు స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని వార్డ్ సచివాలయాల కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, వారి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం బ్రాడీపేట, కోబాల్ట్ పేట, లక్ష్మీపురం, ఎన్టీఆర్ స్టేడియం, ఏటి అగ్రహారం, చుట్టగుంట జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజలతో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తొలుత ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ తో మాట్లాడగా, వారు స్థానికంగా పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, వీధి కుక్కల సమస్యలపై తమ దృష్టికి తెచ్చారని, నగరంలోని 206 వార్డ్ సచివాలయాల కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి, స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో వాకింగ్ ట్రాక్ మరమత్తుల ఫైల్ ని అక్కడే ఓకే చేసి, త్వరగా పనులు ప్రారభించాలని డిఈఈని ఆదేశించారు. త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఫ్రిజ్ మరమత్తుకు గురవ్వడం గమనించి, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బ్రాడీపేట వైపు పీకలవాగులో తీసిన సిల్ట్ తొలగించక పోవడం, స్థానికులు కూడా అక్కడే వ్యర్ధాలు వేయడం గమనించి తక్షణం తొలగించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కంకర గుంట ఆర్యుబి వద్ద జరుగుతున్న రోడ్ నిర్మాణ పనులను పరిశీలించి, వేగంగా చేపట్టాలన్నారు. చుట్టగుంట జంక్షన్ లో పర్యటించి, అవుట్ ఫాల్ డ్రైన్ విస్తరణ చేపట్టడానికి పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, మధుసూదన్, ఏసిపి రెహ్మాన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *