Breaking News

పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈనెల 30వ తేదీన జరుగునున్న పాలిసెట్-పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–పాలిసెట్ 2025 నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మచిలీపట్నం గుడివాడ అవనిగడ్డ నియోజకవర్గాల్లోని 10 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

మొత్తం 4,546 మంది పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటుకు అధికారులను నియమించాలన్నారు. సమన్వయ కేంద్రాలు ఉన్నచోట పోలీస్ స్టేషన్లో ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాల కట్టలను భద్రపరిచేందుకు సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు జారీ చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ప్రధమ చికిత్స పరికరాలు, అవసరమైన మందులు శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరంతరం విద్యుత్తు సరఫరా ఉండేలాగున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే విధంగా అన్ని బస్టాండుల నుండి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులను ఉదయము, మధ్యాహ్నము నడపాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం అంతర్జాల కేంద్రాలు, జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని సంబంధిత మండలాల తహసీల్దారులు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల కోసం మంచినీరు తదితర వసతుల ఏర్పాట్లు సమన్వయకర్త పర్యవేక్షించాలన్నారు. జిల్లా విద్యాధికారి వారి కార్యాలయ సీనియర్ అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి జిల్లా సమన్వయ కర్త వద్దకు పంపాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మచిలీపట్నం గుడివాడ మున్సిపల్ కమిషనర్లు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యం పర్యవేక్షించాలన్నారు.

ఈ సమావేశంలో పాలిటెక్నిక్ జిల్లా సమన్వయకర్త శైలజ, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు,ఆర్టిసి డిఎం పెద్దిరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *