మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అంకితభావంతో విధులు నిర్వహించాలని కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ శాఖకు చెందిన 12 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. వారిలో 8 మంది జూనియర్ అసిస్టెంట్లు కాగా, ఒకరు సచివాలయ కార్యదర్శి, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారు. అందులో టీ. మణి, సిహెచ్ గోపాలకృష్ణ, ఎస్ అజయ్ బాబు, డి కిరణ్ కుమార్, ఏ భరత్ కుమార్, ఎం చైతన్యకుమార్, వై అహల్య, సిహెచ్ భవాని శంకర్ జూనియర్ అసిస్టెంట్లుగా, వినోద్ కుమార్ సచివాలయ కార్యదర్శిగా పి సుజాత, యు వెంకటరావు, ఆఫీస్ సభార్డినేట్లుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నియమించబడిన ఉద్యోగులు వారికి అప్పగించిన విధులను అంకితభావంతో సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి, జడ్పీసీఈవో కన్నమ నాయుడు, డ్వామా డి ఆర్ డి ఏ పిడీలు శివప్రసాద్, హరిహరనాథ్, డిఎస్ఓ పార్వతి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, పౌరసరఫరాల సంస్థ డిఎం సి హెచ్ పద్మావతి,ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ఈ లు లోకేష్, నటరాజు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకట్రావు, డిపిఓ అరుణ, సిపిఓ గణేషు, జిల్లా వ్యవసాయ అధికారి మనోహర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News