Breaking News

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఉయ్యూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఓపి బ్లాక్, ప్రసూతి వార్డు, తదితర వార్డులన్నిటిని చుట్టూ కలియ తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్న రోగులతో ముఖాముఖి మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు ముఖ్యంగా ప్రసవం జరిగినప్పుడు ఎలా ఉన్నాయి, ఆహారము, డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాలపైన వారిని విచారించారు.

అన్ని బాగున్నాయని రోగులు జిల్లా కలెక్టర్కు చెప్పగా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ వైద్యాధికారి డాక్టర్ స్ఫూర్తిని అడగగా ఆమె ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందని, లోడు ఎక్కువై ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ అదనపు ట్రాన్స్ఫార్మర్ల కోసం అంచనాలు రూపొందించి విద్యుత్ శాఖకు పంపించాలన్నారు. తాను వారితో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జిల్లా విభజన అయ్యాక పెనమలూరు పామర్రు కంకిపాడులో పోస్ట్ మార్టం చేసేందుకు సౌకర్యాలు లేవని ఆయా ప్రాంతాల నుండి ఆ కేసులన్నీ ఉయ్యూరుకె రావడంతో ఇబ్బంది ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ కు వైద్యాధికారి చెప్పగా వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి డిసిహెచ్ఎస్ శేషు కుమార్ తో మాట్లాడి మిగిలిన ప్రాంతాల్లో కూడా వీలైనంత త్వరగా పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దారు సురేష్ కుమారు, ఎంపీడీవో శేషగిరిరావు, హెచ్ డి ఎస్ చైర్పర్సన్ జయదేవ్, డాక్టర్ స్వరూప, సిస్టర్ నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *