Breaking News

ఎం జి ఎం పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయస్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన రెజ్లింగ్, హాకీ టోర్నమెంట్ నందు ఉత్తమ ప్రతిభ కనబరిచిన తిరుపతి ఎం.జి. ఎం పాఠశాలలో చదువుతున్న టీ ప్రణీత ఏడవ తరగతి (రెజ్లింగ్), జ్యోతిర్మయి 8వ తరగతి (రెజ్లింగ్), మహాలక్ష్మి 8 వ తరగతి (హాకీ)చదువుతున్న విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయస్థాయిలో నిర్వహించే వివిధ టోర్నమెంట్ల నందు ఆడి ఇంకా మరిన్ని పథకాలు సాధించి తల్లి తండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కేవిఎన్ కుమార్, పాఠశాల హెచ్ఎం ముని, శారద , పి టి ప్రసన్న కుమారి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *