Breaking News

వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ , సంబంధిత అధికారులతో కలిసి వైజాగ్ చెన్నైఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులలో భాగమైన పలు ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించిన భూసేకరణ పనులు, రోడ్లు తదితర అంశాలపై విసిఐసి, రెవెన్యూ, ఏపీఐఐసీ , ఆర్ అండ్ బి శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు అభివృద్ధి పనులకు సంబంధించిన సంబంధించి నాయుడుపేట, మేనకూరు మండలాలకు సంబంధించిన ఏడు గ్రామాలలో భూ సేకరణ పెండింగ్, రోడ్లు పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ మధుసూదన్ రావు, సంబంధిత మండలాల తాసిల్దారు , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *