Breaking News

జి జి హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం మధ్యాహ్నం ఐసోలేషన్ వార్డును పరిశీలించిన, అనంతరం మాతా శిశు సంరక్షణ వార్డు, క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు పురోగతి పై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎమ్ లక్ష్మీ సూర్య ప్రభను వివరాలు అడిగి తెలుసు కోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఐసోలేషన్ వార్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలని ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు ను తగిన వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేసుకోవాలని కోరారు.. ఇప్పటికే మాతా శిశు ఆరోగ్య బ్లాక్ అందుబాటు లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గత సమావేశంలో స్పష్టం చేశామన్నారు. 15 రోజుల్లో ఎమ్ సి హెచ్ బ్లాక్ ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ బోధన ఆసుపత్రి కి అనుసంధానంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా ప్రజలకి అత్యవసర వైద్య సేవలు అందించే విధంగా పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రోగులకి అందచేస్తున్న వివిధ రకాల వైద్య సేవలు, మానవ వనరులు వివరాలు తెలుసుకోవడం జరిగింది. వైద్యులు, సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *