Breaking News

నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్ ధాన్యం సేకరణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు , దిగుబడి అనుసరించి అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గెయిల్ ఏం.. ప్రేమ కుమార్, డి ఎస్వో ఎస్ భాస్కర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ఎమ్. జనార్ధన రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, తదితరులతో రబీ సీజన్లో ధాన్యం సేకరణ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో రబీ సీజన్ ధాన్యం సేకరణ విషయంలో గ్రామ స్థాయిలో ఉన్న రైతు సేవా కేంద్రం – ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి పర్యవేక్షణ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేయాలన్నారు.. ఇందు కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయి లో ఆయా శాఖల ఆధ్వర్యంలో అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గెయిల్) ఆధ్వర్యంలో కంట్రోలింగ్ వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు కు సూచించారు. రైతు సేవా కేంద్రము కు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేసినట్లు  కాకుండా అవసరమైన మేరకు అదనపు లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉంటుందని అందుకు అనుగుణంగా షెడ్యూల్ చేయాలని స్పష్టం చేశారు. రైతు సేవా కేంద్రాలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసిన వాటిని ఇతర ఆర్ ఎస్ కె లతో అనుసంధానం చెయ్యాలని, కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని పేర్కొన్నారు. జిల్లా సహకార అధికారి అధ్వర్యంలో పని చేసే క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించారు.  రైతు సేవా కేంద్రాలకు, బహిరంగ మార్కెట్ కు సంబంధించిన లావాదేవీలని ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చెయ్యడం తప్పనిసరి అని, అందుకు సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *