Breaking News

పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయము లో శుక్రవారం రాత్రి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించడం జరిగింది. జిల్లాలో ఉన్న 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇప్పుడున్న ఓపి కౌంటు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే అన్ని వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని ముఖ్యంగా గర్భిణీ సేవలు, పిల్లల సేవలు ల్యాబ్ టెస్టులు పెంచాలని తెలియజేశారు. స్థానిక ANM ఇతర హెల్త్ స్టాఫ్ అందరూ వైద్యాధికారులు సమయపాలన పాటించాలని తెలియజేశారు. అదేవిధంగా మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశలకి ఇతర ఏ విధమైన పనులు కు వినియిగించారాదని, పూర్తిగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న సేవలో పై దృష్టి ఉంచాలని ఈ సమావేశానికి హాజరైన డాక్టర్ వినూత్న ఎంహెచ్ఓ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఓపికి వచ్చిన వారందరికీ తగిన మందులు రాసి సరిపడా మందులు అందించాలని వారికి ఏ కొర త లేకుండా అందించాలని తెలియజేశారు. అదేవిధంగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సమావేశపు అజెండాలో పైన తెలిపిన అన్ని అంశాలు చర్చించాలని తెలియజేశారు.

ఈ సమావేశంలో డిఎంహెచ్వో కే వెంకటేశ్వరరావు ఇతర వైద్య అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *