Breaking News

దేశ సమగ్రత, ఐక్యతకు చిచ్చుపెట్టాలని పాకిస్థాన్ ఉగ్రదాడులు: గొట్టిపాటి, జీవీ

-కొవ్వొత్తుల ర్యాలీలో మంత్రి గొట్టిపాటి, చీఫ్‌ విప్‌ జీవీ ధ్వజం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భిన్నకులాలు, మతాలు, సంస్కృతులు వారంత ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశం సమగ్రత, ఐక్యతలో చిచ్చుపెట్టాలనే పాకిస్థాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జీవీ ఆంజనేయులు. హిందువులను వెతికి మరీ చంపడం బట్టి చూస్తే వారి లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ ముష్కరమూకల్ని ఎన్డీయే ప్రభుత్వం ఉరికంబం ఎక్కించడం ఖాయమన్నారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ వినుకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పల్నాడు జిల్లా ఇన్ ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శివయ్య స్తూపం సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో పట్టణవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళి అర్పించారు. మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉగ్రవాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి ప్రపంచంలో అనేక దేశాలతో పోటీపడి ఆర్థికంగా బలమైనశక్తిగా ఎదిగిన భారత్‌ను ఓర్చు కోలకనే పాకిస్థాన్ ఈ కుట్రలకు పాల్పడుతోందన్నారు. హిందు-ముస్లింలు కలసికట్టుగా ఉంటున్నారని వారి ఐక్యతనుచెడగొట్టాలనే ఇలాంటి దాడులు చేయడం అత్యంత బాధాకరమన్నారు. ప్రపంచదేశాలన్నీ కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయని, చేసిన పాపానికి పాకిస్థాన్ తప్పక తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. చీఫ్‌విప్‌ జీవీ మాట్లాడుతూ ఉగ్రదాడిలో చనిపో యిన వారికి ఆత్మశాంతి కలగాలని. వారి కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడుని ప్రార్థిస్తున్నా అన్నారు. హిందువులను టార్గెట్ చేసి చంపడం హేయమైన చర్య అని, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నందుకు పాకిస్థాన్ సిగ్గుపడా లన్నారు. భారతదేశ సమగ్రత ఐక్యతకు దెబ్బకొట్టాలనే పాకిస్థాన్ కుట్రలు చెల్లవని, ఇలాంటి కుట్రలను తిప్పికొడతామన్నారు. పాకిస్థాన్‌పై కఠిన చర్యలుతీసుకుంటున్న ప్రధానమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో అన్నిమతాలు, అన్ని కులాలు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా ఉంటారన్నారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదులను ఎన్డీయే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచి వేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *