-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 28న (సోమవారం) గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగనున్నాయని, ఎన్నికల సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్) కార్యక్రమాలను రద్దు చేయడం జరిగిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ రద్దు అంశాన్నిగమనించి సహకరించాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగర పాలక సంస్థ కాల్ సెంటర్ 0863-2345103 పిర్యాదు చేయవచ్చునన్నారు.
Prajavartha Online Telugu News