Breaking News

సెలవు రోజుల్లోనూ (ఆదివారం) పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు …

-కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2025-26) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా ఏప్రిల్ నెలాఖరులోపు ఏక మొత్తంగా చెల్లించే వారికి మొత్తం పన్నుపై 5 శాతం రాయితీ, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీకి మరో 4 రోజులే గడువు ఉందని, నగరపాలక సంస్థ క్యాష్ కౌంటర్లు ఆదివారం సెలవు రోజైనప్పటికీ పని చేస్తాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్నుబకాయిలను ఒకేసారి ఏక మొత్తంగా చెల్లిస్తే వారికి వడ్డీపై 50 శాతం రాయితీని కూడా ఈ నెలాఖరులోపు చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఆస్తి పన్నుదారులకు సౌలభ్యంగా జిఎంసి ప్రధాన కార్యాలయంలో 8, సర్కిల్ కార్యాలయంలోని 6 ట్యాక్స్ కలెక్షన్ కౌంటర్లు ప్రతి రోజు ఉదయం 7 నుండి రాత్రి 8 గంటల వరకు పని చేసెలా ఏర్పాటు చేశామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *