గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్లపై వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్ కి అడ్డంకిగా ఉండే వాటిని తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. శనివారం కమిషనర్ నెహ్రు నగర్, రాజీవ్ గాంధీ నగర్, సంజీవయ్య నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన రోడ్ల పక్కన, డ్రైన్లను ఆక్రమించుకొని ట్రాఫిక్ కి అడ్డంకిగా వ్యాపారాలు చేసుకునే వాటిని తొలగించాలన్నారు. అలాగే వార్డ్ సచివాలయాల వారీగా ప్రతి కమర్షియల్ సంస్థ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండేలా శానిటేషన్ కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలన్నారు. తమ రోజువారీ పర్యటనలలో ట్రేడ్ లేని కమర్షియల్ సంస్థలను గుర్తిస్తే శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లే భాద్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. నెహ్రు నగర్ లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి రోడ్ ని పరిశీలించి, పనులు జరిగే సమయంలోనే కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రతి రోజు చెత్త సేకరణ, డ్రైన్ల క్లీనింగ్ కి కార్మికులు వస్తున్నంది లేనిదీ అడిగి తెలుసుకొని, మెరుగైన పారిశుధ్య పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులను ఆదేశించారు. పర్యటనలో ఎస్ఎస్ ఐజాక్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News