Breaking News

అన్నక్యాంటీన్లలో నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్లలో నోడల్ అధికారులు ప్రతి రోజు పరిశీలించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం మిర్చి యార్డ్ వద్ద గల అన్న క్యాంటీన్ ని పరిశీలించి ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో మౌలిక వసతుల కల్పన కీలకమని, ప్రతి క్యాంటీన్ లో త్రాగునీరు, హ్యాండ్ వాష్ కి నీరు అందుబాటులో ఉంచేలా నోడల్ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్యాంటీన్లలో ఏమైనా మరమత్తులు ఉంటే ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *