కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలో లోని 45 గ్రామాల్లో సమిత్వ సర్వే జరుగుతున్నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. శనివారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో స్వమిత్వ సర్వే ప్రక్రియ పై క్షేత్ర స్థాయి అధికారులతో, సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో 45 గ్రామాల్లో స్వమిత్వ సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 22 గ్రామాలకు గ్రౌండ్ ట్రూథింగ్ నూరుశాతం పూర్తి చేశారన్నారు. డివిజన్ మొత్తం లో 75% గ్రాండ్ ట్రూతిటింగ్ పని పూర్తి అయ్యిందనీ, గ్రామ స్థాయిలో 100 శాతం గ్రౌండ్ ట్రూథింగ్ చెయ్యడం పై సర్వే సిబ్బంది తో తహసిల్దార్ లు, ఎంపీడీవో, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్‌పిఓ, ఐఓఎస్, డిఐఓఎస్, తహసిల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, రిజర్వు డిప్యూటీ తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో పాటు స్వామిత్వ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News