45 గ్రామాల్లో సమిత్వ సర్వే

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ పరిధిలో లోని 45 గ్రామాల్లో సమిత్వ సర్వే జరుగుతున్నట్లు ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. శనివారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో స్వమిత్వ సర్వే ప్రక్రియ పై క్షేత్ర స్థాయి అధికారులతో, సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో 45 గ్రామాల్లో స్వమిత్వ సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. వాటిలో ఇప్పటి వరకు 22 గ్రామాలకు గ్రౌండ్ ట్రూథింగ్ నూరుశాతం పూర్తి చేశారన్నారు. డివిజన్ మొత్తం లో 75% గ్రాండ్ ట్రూతిటింగ్ పని పూర్తి అయ్యిందనీ, గ్రామ స్థాయిలో 100 శాతం గ్రౌండ్ ట్రూథింగ్ చెయ్యడం పై సర్వే సిబ్బంది తో తహసిల్దార్ లు, ఎంపీడీవో, పంచాయతీ సిబ్బంది సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎల్‌పిఓ, ఐఓఎస్, డిఐఓఎస్, తహసిల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, రిజర్వు డిప్యూటీ తహసిల్దార్లు, మండల సర్వేయర్లతో పాటు స్వామిత్వ నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *