గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యం, పారిశుధ్య పర్యవేక్షణ లోపంపై 8వ శానిటరీ డివిజన్ ఇన్స్పెక్టర్ పి.రాంబాబుని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన తమ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 8వ శానిటరీ డివిజన్ లో కార్మికుల హాజరు రిజిస్టర్ లో ముగ్గురు కార్మికులు హాజరు నమోదు చేసి ఉండగా, సదరు కార్మికులు విధుల్లో లేకుండడం గుర్తించామన్నారు. సదరు డివిజన్ లో పారిశుధ్య పనుల పర్యవేక్షణలో కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు నిర్లక్ష్యంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, విధుల నుండి సస్పెండ్ చేశామన్నారు. 8 డివిజన్ ఇంచార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఏ.బాబుని నియమించామని తెలిపారు. ప్రజారోగ్య విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, కాని కొందరు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంపై ఇక నుండి ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News